రాజస్థాన్లో దారుణ ఘటన, ముక్కుపచ్చలారని ఓ పసికందుని చెత్తకుప్పలో వదిలేసి వెళ్లిపోయిందో కర్కశ తల్లి. దుర్వాసన మధ్య ఆ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తుండడం గమనించిన స్థానికులు వీడియో తీశారు. అనంతరం వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవడంతో బాలీవుడ్ దర్శకుడు వినోద్ కాప్రి దృష్టికి వచ్చింది.
వినోద్, పాప పరిస్థితిని చూసి చలించిపోయిన దత్తత తీసుకోవాలనుకున్నారు. వెంటనే పాప చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లారు. చిన్నారికి ‘పీహూ’ అని పేరుపెట్టారు. ‘ఈ చిన్నారి ఏంజిల్తో నేను నా భార్య ప్రేమలో పడ్డాం. దత్తత తీసుకునే ప్రక్రియ మొదలైంది. అన్నీ అనుకున్నట్లు జరిగాక మిగిలిన విషయాలు మాట్లాడతాను’ అని చెప్పాడు వినోద్ కాప్రి. అన్నట్టు ‘పీహూ’ అనే పేరు ఆయన తెరకెక్కించిన సినిమా పేరు.
అన్నయ్య సినిమాలు వరుణ్ రీమేక్ చేస్తే పెద్ద సవాలే..!