చైనా సిచువాన్ ప్రావిన్స్‌లో మంగళవారం వేకువజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 134 మందికి తీవ్ర గాయాలయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రకంపనలు భారీ స్థాయిలో ఉండటంతో ప్రజలంతా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని రోడ్లపైకి పరుగులు తీశారు. రెండు సార్లు భూప్రకంపనలు చోటుచేసుకోగా.. రిక్టర్ స్కేలుపై ఒకసారి 5.9, మరోసారి 5.2 తీవ్రతగా నమోదైంది. చాంగ్నింగ్ నగరానికి 10 కి.మీ. దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం వెల్లడించింది. ఈ ప్రమాదం వల్ల పలు ప్రముఖ హోటళ్లు, కార్యాలయాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమవారం అర్థరాత్రి సుమారు 30 నిమిషాల వ్యవధిలో పలుసార్లు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.
							previous post
						
						
					
							next post
						
						
					

