telugu navyamedia
సినిమా వార్తలు

ఫెమినిస్ట్ అన్న నెటిజన్ కు సమంత కౌంటర్

Samantha

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత సరికొత్త లుక్ లో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది. సాధారణంగా సామ్ సినిమాలన్నింటికీ ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద డబ్బింగ్ చెబుతూ ఉంటారు. అలాగే “ఓ బేబీ” చిత్రం తమిళ్ వర్షన్‌కు కూడా చిన్మయి డబ్బింగ్ చెప్పారు. ఈ విషయాన్ని సామ్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. తమిళంలో చిన్మయి డబ్బింగ్ చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన శైలజ అనే నెటిజన్ చాలా సంతోషంగా ఉందని, దర్శకురాలు నందినిరెడ్డి, సమంతల కాంబినేషన్‌పై అంచనాలు ఎక్కువగానే ఉంటాయని పేర్కొంది. “ఓ బేబీ” సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు శైలజ తెలిపింది. ఈ ట్వీట్లను చూసిన కిరు అనే అనే నెటిజన్ “ఫెమినిస్ట్‌లందరూ ఒకే దగ్గర ఉన్నారుగా.. మూవీ పక్కా ప్లాప్” అని కామెంట్ చేశాడు. దీనిపై సామ్ స్పందిస్తూ “హాహా.. థాంక్యూ.. ప్రపంచం ఒక మూర్ఖుడిని కలిసింది… మూర్ఖుడు ప్రపంచాన్ని కలిశాడు” అని సమాధానమిచ్చింది.

Related posts