ఆహారప్రియులకు మరోసారి తెలంగాణ వంటలు స్వాగతం పలుకుతున్నాయి. ఫుడ్ ఫెస్ట్ ప్రారంభం అయ్యింది. అనేక రకాల తెలంగాణ వంటలతో ఈ ఫెస్ట్ ఆహార ప్రియుల నోరు ఊరిస్తుంది. ఈ ఫెస్ట్ లో సాంప్రదాయ వంటల సమాహారంతో పాటుగా అనేక ఇతర వంటలు కూడా నిర్వాహకులు అందుబాటులో ఉంచారు.
ఆనుగ కాయ కూర – సల్ల చారు, పచ్చి పులుసు, సర్వ పిండి (తపాల చెక్క), కట్టె గారెలు, పొట్టేలు తలకాయ కూర, మటన్ – లివర్ ఫ్రై, బోటీ, నాటు కోడి కూర, ముక్కెర పాముల (బొమ్మిడాయిల) పులుసు, తాటి కల్లు, ఈత కాయలు, జిట్టీత కాయలు, తాటి ముంజలు, రవ్వ లడ్డూ, బగార అన్నం, కారపూస (సన్న), కొర్రల పాయసం, అరిసెలు తదితర ప్రత్యేకత సంతరించుకున్న వంటకాలతో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ఆవిష్కరించబడింది. పసందైన విందుకు సోమాజిగూడలోని మెర్క్యూర్ హోటల్ వేదికైంది. ఈ వేడుక జూన్ రెండో తేదీ వరకు కొనసాగుతుంది.