వివిధ దేశాలకు చెందిన ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులకు రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. నేరగాళ్లు డ్రగ్స్ ను సప్లై చేయడానికి కొత్త కొత్త పద్ధతులను పాటిస్తుంటారు. తాజాగా దుబాయి నుంచి ఈజిప్టుకు వెళ్లే విమానం ఎక్కడానికి వచ్చాడో యువకుడు. అందరిలానే అతని వస్తువులన్నింటినీ తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులకు.. అతని కడుపులో ఏదో పదార్థం ఉందని అనుమానించిన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని కడుపులో ఏమున్నాయో డాక్టర్ల పర్యవేక్షణలో చూసి షాకయ్యారు. ఎందుకంటే అతని కడుపు నిండా కండోమ్‌లే ఉన్నాయి. దాదాపు 80 కండోమ్‌ల నిండా కొకైన్ కుక్కిన అతను.. వాటిని మింగేశాడు. అలా ఆ డ్రగ్స్‌ను ఈజిప్టు తీసుకెళ్తున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. దాంతో అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు.. లక్ష దీనార్లు (సుమారు రూ. ఇరవై లక్షలు) జరిమానా విధించింది. శిక్షాకాలం పూర్తికాగానే అతన్ని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
							previous post
						
						
					


పవన్ ఓటమిపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్