నేడు తొలివిడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ 20 రాష్ట్రాలలో ప్రారంభం అయ్యింది. ఏపీలో 25, తెలంగాణ 17, యూపీ 8, మహారాష్ట్ర 7, అస్సాం 5, ఉత్తరాఖండ్ 5, ఒడిశా 4, బీహార్ 4, పశ్చిమ బెంగాల్ 2, అరుణాచల్ ప్రదేశ్ 2, ఛత్తీస్ గఢ్ 1, జమ్మూ 2, మణిపూర్ 1, మేఘాలయ 1, మిజోరాం 1, నాగాలాండ్ 1, సిక్కిం 1, త్రిపుర 1, అండమాన్ 1, లక్ష్యదీప్ 1 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఏపీలో మొత్తం 45,920 పోలింగ్ కేంద్రాలు ఏర్పటు చేశారు. వీటిలో నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 6 గంటలకు క్యూ లో ఉన్న ప్రతివారు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. దాదాపు 9వేల సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు కావున సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 2, 118 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 25 లోక్ సభ సీట్లకు 319 మంది బరిలో ఉన్నారు.
తెలంగాణాలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. దాదాపు 3కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఒక్క నిజామాబాద్ లో 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో సాయంత్రం 4 గంటలవరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. తెలంగాణాలో 34,604 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 5,749 సమస్యాత్మకంగా గుర్తించారు. బరిలో 443 మంది అభ్యర్థులు ఉన్నారు. ఒక్క నిజామాబాద్ లోనే 185 మంది అభ్యర్థులు ఉన్నారు.
కొన్ని చోట్ల ఎప్పటిలాగే ఈవీఎం లు మొరాయిస్తున్నాయి. దీనితో వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేస్తుంది ఎన్నికల సంఘం. ఒక్క ఏపీలోనే 1800 చోట్ల ఈవీఎం లు సమస్యలు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే ప్రధానపార్టీ నేతలు తమ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.


రాజకీయాల్లోకి మాస్ లీడర్లను తీసుకొస్తా: పవన్ కల్యాణ్