జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోని డీఆర్సీ సెంటర్‌లో శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో లెక్కింపు ప్రారంభమవుతుందని రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్వో కర్ణన్ తెలిపారు.
మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు.
ఉపఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నందున, ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించారు.
10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని అధికారులు అంచనా వేశారు. ఒక్కో రౌండ్‌కు సుమారు 45 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది.
మొత్తం ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నట్లు ఆర్వో కర్ణన్ తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అనుమతి ఉన్నవారు మాత్రమే కేంద్రం వద్దకు రావాలని హెచ్చరించారు.
ఫలితాలను ఎప్పటికప్పుడు ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని, మీడియా కోసం ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.


రాజగోపాల్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు: వీ.హెచ్