telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాజగోపాల్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు: వీ.హెచ్

Congress Hanmanth Rao Governor TRS agent

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.

రాజగోపాల్ రెడ్డి అంతటి వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో స్పష్టం చేయాలని నిలదీశారు. నల్గొండ నాయకులు ఏమైనా మాట్లాడొచ్చా అంటూ విమర్శించారు. ఇది నల్గొండ కాంగ్రెస్సా..? లేక తెలంగాణ కాంగ్రెస్సా..? అంటూ ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డిని ఎన్నిసార్లు వదిలేస్తారని ప్రశ్నించారు. పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని వీ.హెచ్ నిలదీశారు.

Related posts