telugu navyamedia
వార్తలు సామాజిక

ఆందోళన వద్దు.. కరోనా బలహీనపడుతోంది: వేన్ యూనివర్శిటీ

CQVI Virus

చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అన్ని దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మన దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్షను దాటింది. ఈ ఆందోళనల నేపథ్యంలో అమెరికాలోని వేన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా వైరస్ క్రమంగా బలహీనపడుతోందని తెలిపారు.

డెట్రాయిట్ హాస్పిటల్ లో చేరిన 700 మంది రోగుల శాంపిల్స్ ని పరిశీలించి వారు ఈ విషయాన్ని వెల్లడించారు. మొదటి వారంలో ఎక్కువ మందిలో అధిక వైరల్ లోడ్ ఉందని తెలిపింది. కేవలం నాలుగో వంతు మాత్రమే తక్కువ వైరల్ లోడ్ కలిగి ఉన్నారని పరిశోధకులు తెలిపారు. ఐదో వారం నాటికి 70 శాతానికి పైగా శాంపిల్స్ లో తక్కువ వైరల్ లోడ్ ఉన్నట్టు తేలిందని చెప్పారు. వైరస్ క్రమంగా బలహీనపడుతోందనే విషయం తమ పరిశోధనలో తేలిందని అన్నారు.

Related posts