telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిలో నిర్మించే విద్య, ఆరోగ్య సంరక్షణ సంస్థలకు స్టాంప్ డ్యూటీలు రీఎంబర్స్ మెంట్

అమరావతిలో నిర్మించే విద్య, ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సాహం ప్రకటించింది .

విద్య, ఆరోగ్య సంరక్షణ స్టాంప్ డ్యూటీ మినహాయించాలని నిర్ణయం తీసుకుంది.

స్టాంప్ డ్యూటీలు రీఎంబర్స్ మెంట్ విధానంలో తిరిగి చెల్లించనున్న ప్రభుత్వం – 2025 జనవరి 1 తర్వాత భూములు కేటాయించిన 7 సంస్థలకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు.

బిట్స్, లా వర్సిటీ, సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్టులకు, బసవతారక క్యాన్సర్ ఫౌండేషన్ , కిమ్స్/బిజర్, ఈఎస్ఐసీ, రెడ్ క్రాస్ సొసైటీలు నిర్మించే భవనాలకు, 7 సంస్థలకు కేటాయించిన 184.78 ఎకరాల భూములపై స్టాంప్ డ్యూటీ మినహాయింపు ను ప్రభుత్వం ప్రకటించింది

తదుపరి చర్యలు తీసుకోవాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ఐజీ, కమిషనర్ కు ఆదేశాలు జారీచేశారు.

Related posts