అసెంబ్లీలో ఇవాళ హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఫైరయ్యారు. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే గట్టిగా ఎవ్వరూ అడగలేదన్నారు.
జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందంటూ సభలో ఎమ్మెల్యే కామినేని చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి బాలకృష్ణ ఆవేశంగా ప్రసంగించారు.
ఆ రోజు సినీ ప్రముఖులను జగన్ కలిసేందుకు ఇష్టపడకపోతే చిరంజీవి గట్టిగా ఆడిగాక జగన్ సినీ ప్రముఖులను కలిశారన్న కామినేని వ్యాఖ్యలతోనూ బాలయ్య ఏకీభవించలేదు.
కామినేని మాటలకు అభ్యంతరం వ్యక్తం చేసిన బాలకృష్ణ ఆ రోజు గట్టిగా అడిగిన వారెవ్వరూ లేరని సభకు స్పష్టం చేశారు. ఆ సైకో గాడిని కలిసేందుకు తనకూ ఆహ్వానం వచ్చినా వెళ్లలేదన్న విషయాన్ని బాలకృష్ణ గుర్తు చేశారు.
చిరంజీవిని అవమానించారు అనడం వరకూ వాస్తవమే అని చెప్పిన బాలకృష్ణ కూటమి ప్రభుత్వంలోనూ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తనది 9వ పేరుగా ముద్రించిందన్నారు.
ఎవడాడు ఇలా రాసిందని ఆరోజే తాను అభ్యంతరం వ్యక్తం చేశానని బాలకృష్ణ చెప్పారు.
అసెంబ్లీకి స్పష్టత ఇవ్వాలనే తాను ఈ అంశంపై స్పందించానన్న బాలకృష్ణ ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండంటూ సభను కోరారు.