telugu navyamedia
రాజకీయ వార్తలు

పీవోకే తనకు తానే భారత్ లో భాగమని ప్రకటించుకునే రోజు దగ్గర్లోనే ఉంది: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) స్వాధీనంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాన్ని భారత్ లో కలిపేసుకోవడానికి ప్రత్యేకంగా యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

పీవోకే తనకు తానే భారత్ లో భాగమని ప్రకటించుకునే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. మొరాకోలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ అక్కడి భారత సంతతి ప్రజలతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

పీవోకే ప్రజలు ప్రస్తుత పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఐదేళ్ల క్రితం ఆర్మీ సమావేశంలో ప్రసంగిస్తూ ఇదే విషయం చెప్పానని గుర్తు చేశారు.

‘పీవోకే మనదే అవుతుంది. మనం దాడి చేసి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు. పీవోకేనే తాను భారత్‌‌‌‌లో భాగమని చెబుతుంది’ అని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

Related posts