telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ ని అధికారికంగా ప్రకటించిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. తన పార్టీకి ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ అనే పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు.

ఈ మేరకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించి ప్రజల ముందుకు తెచ్చారు.

ఈ సందర్భంగా పార్టీ జెండాను కూడా పరిచయం చేశారు. పార్టీ జెండాను రెండు రంగులతో రూపొందించారు.

జెండా పైభాగంలో ఎరుపు రంగు, కింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉన్నాయి. జెండా మధ్యలో కార్మిక చక్రాన్ని, దాని నుంచి పైకి లేస్తున్నట్లుగా పిడికిలి బిగించిన మానవుడి చేతిని చిహ్నంగా పొందుపరిచారు.

ఈ చిహ్నానికి ఇరువైపులా రెండు ఆలీవ్ ఆకులను చేర్చారు. జెండాపై ‘ఆత్మగౌరవం, అధికారం, వాటా’ అనే నినాదాన్ని ముద్రించారు

Related posts