బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
తీవ్ర అస్వస్థతతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని అన్నారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. గోపీనాథ్ రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైందని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ అర్బన్ అధ్యక్షుడిగా పని చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 2014లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు.
గోపీనాథ్ కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.


చంద్రబాబు సేవలు దేశానికి అవసరం: కనకమేడల