telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎస్ఐ దుర్గారావు మృతిపట్ల స్పందించిన సోము వీర్రాజు

Somu Veerraju BJP

పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్ఐ దుర్గారావు మృతిపట్ల బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. ప్రశంసలు పొందిన అధికారికి పది ఛార్జి మెమోలు ఇచ్చి అవమానపరిచారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆయన మృతికి సంబంధించి వచ్చిన వార్తలను సోము వీర్రాజు పోస్టు చేస్తూ ఆయనను మానసిక క్షోభకు గురి చేశారని చెప్పారు.

నిజాయతీ గల పోలీసు అధికారిని వెంటాడి, వేధించి అవినీతి ఆరోపణలతో మానసిక క్షోభకు గురి చేశారని ఆరోపించారు. నిజాయితీపరుడికి ఈ భూమ్మీద చోటు లేదు అన్నట్లుగా ఎస్ఐ దుర్గారావు గారి మరణానికి కారణమయ్యారని అన్నారు. ఇలాంటి ఘటనల కారణంగా నిజాయితీతో పనిచేసే అధికారులు కూడా భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉందన్నారు.

పోలీస్ శాఖ పని తీరు ప్రశ్నార్థకంగా మారిన ఘటన ఇది’ అని సోము వీర్రాజు తెలిపారు.బాసటగా నిలవాల్సిన సొంత పోలీసు అధికారులే మానసిక క్షోభకు గురిచేశారనే వాదనలు వినిపిస్తుండటం అత్యంత దయనీయంమని పేర్కొన్నారు. నిజాయతీగా పని చేసిన సదరు అధికారి కుటుంబం నిలువ నీడ లేక రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తక్షణమే ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

Related posts