telugu navyamedia
Uncategorized

షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలో టాపర్స్‌ గా నిలిచిన విద్యార్థులను సత్కరించేందుకు అమరావతిలో ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ విద్యార్థులతో మమేకమై తన అనుభవాలను పంచుకున్నారు.
విద్యార్థుల వేసిన ప్రశ్నలకు ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చారు.

మీకు స్కూల్ పరీక్షలు కష్టమా? అసెంబ్లీ ప్రశ్నలూ? అని చీరాలకి చెందిన విద్యార్థి సంతోష్ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ నవ్వుతూ ఇవ్వాళ్టి అసెంబ్లీ ప్రశ్నలు స్కూల్ పరీక్షల కంటే కష్టంగా ఉంటాయి.

ప్రతిపక్షం లేకున్నా, అధికారపక్ష సభ్యులే ఘాటు ప్రశ్నలు వేస్తున్నారు” అంటూ సమాధానం ఇచ్చారు.
ఇదే సమయంలో తన చిన్ననాటి స్నూల్ అనుభవాలను ఆయన పంచుకున్నారు.

స్కూల్ డేస్‌ లో తాను లాస్ట్ బెంచ్ అని తమది అల్లరి బ్యాచ్!” అంటూ విద్యార్థుల్లో నవ్వులు పూయించారు.

మీకు ఇష్టమైన కొటేషన్ ఏంటని ఓ విద్యార్తి అడగ్గా “డేర్ టు డ్రీమ్.. స్ట్రైవ్ టు అచీవ్” అని తన తండ్రి సీఎం చంద్రబాబు చెప్పిన మాట తనకు ప్రేరణగా నలిచిందన్నారు.

రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం ఎలా తీసుకున్నారని మరో విద్యార్తి అడగ్గా ఈ ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం గర్వకారణంగా మారింది.

ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ 2005లో ఓటమి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ కి వెళ్లానని.

ఆయన వేదికపైకి వెళ్లేసరికి అక్కడున్న 5 వేలమంది లేచినిలబడ్డారు. అప్పుడే గ్రహించాను రాజకీయాల్లో మంచిచేస్తే ప్రజల గుండెల్లో స్థానం దక్కుతుందని.

ఆ రోజు నిర్ణయించుకున్నా నేనూ ప్రజాసేవలోకి రావాలని ఆయన చెప్పారు.

మీరు అదృష్టాన్ని నమ్ముతారా, కష్టాన్ని నమ్ముతారా?” అని మరో విద్యార్థి అడిగిన ప్రశ్నకు లోకేష్ గట్టి సమాధానం ఇచ్చారు.

“జీవితంలో ఉన్నత శిఖరాలను చేరాలంటే కష్టమే మార్గం. అదృష్టం వస్తే బాగానే ఉంటుంది. కానీ అది కృషిని మించిన దారి కాదని ఆయన అన్నారు.

సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ ఇద్దరూ కష్టంతోనే ఆ స్థాయికి చేరుకున్నారు. నేనూ 226 రోజుల యువగళం పాదయాత్రలో ఎంతో నేర్చుకున్నానని మంత్రి సమాధానం ఇచ్చారు.

ఈ సంభాషణ తర్వాత విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను నేరుగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

శ్రీకాకుళం విద్యార్థిని రౌతు హారిక “వందరోజుల యాక్షన్ ప్లాన్ తో మా నమ్మకం పెరిగింది. కానీ మాకు పాఠాలు మాత్రమే కాక, లైబ్రరీ, ప్రాక్టికల్ లెర్నింగ్ కు కూడా సమయం కావాలి అన్న విషయాలను మంత్రి తెలిపింది.

వీటిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ ప్యాసివ్ లెర్నింగ్ (సాధారణ పాఠాలు) కంటే యాక్టివ్ లెర్నింగ్ (ప్రయోగాత్మకంగా నేర్చుకోవడం) అవసరం.

దానివైపు ప్రభుత్వ దృష్టి ఉంది. స్కూళ్లలో లైబ్రరీలు, ల్యాబ్లు పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం అని విద్యార్థులకు తెలిపారు.

మా గ్రామంలో రోడ్లు బాగోలేవు, టీచర్లు, విద్యార్థులు పాదయాత్ర చేస్తూ స్కూల్కు వస్తున్నారు అని పల్నాడు జిల్లా ఒప్పిచర్లకు చెందిన విద్యార్థిని పావని మంత్రికి విన్నవించగా, లోకేష్ వెంటనే స్పందిస్తూ రోడ్లు వేసేందుకు నేను స్వయంగా ఏర్పాట్లు చేయిస్తానని మంత్రి అన్నారు.

కెజిబివి స్కూళ్లలో పంచతంత్ర విధానం బాగుంది. మరిన్ని సౌకర్యాలు కావాలి” అని మరో విద్యార్థి అడగ్గా మంత్రి సానుకూలంగా స్పందించారు.

వెజిటబుల్ బిర్యానీ, రాగి జావ అంశం పై విద్యార్థుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కు కూడా లోకేష్ గమనించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు లోకేష్.

Related posts