telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తన భర్త ప్రవీణ్ పగడాల మరణాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవద్దు: జెస్సికా పగడాల

పాస్టర్ ప్రవీణ్ పగడాల భార్య జెస్సికా పగడాల సైతం వీడియో విడుదల చేశారు. తన భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దంటూ ఆమె వీడియో విడుదల చేశారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కొంత మంది తన భర్త మరణాన్ని వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏసు మార్గంలో నడిచే ఎవ్వరూ మత విద్వేషాలు రెచ్చగొట్టరని చెప్పారు. తన భర్త ప్రవీణ్ ఎప్పుడూ మత సామరస్యం కోరుకునేవారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు.

ప్రభుత్వం చేపడుతున్న విచారణపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. పోలీసుల విచారణ సక్రమంగా జరుగుతుందన్నారు.

ప్రవీణ్ మరణాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని అనుకోవడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు.

Related posts