నటరత్న ఎన్.టి. రామారావు గారు నటించిన సాంఘీక చిత్రం రవిచిత్ర ఫిలిమ్స్ “నేరం నాది కాదు ఆకలిది” సినిమా 22-07-1976 విడుదలయ్యింది.
హిందీ చిత్రం “రోటీ”(1974) ఆధారంగా నిర్మాత వై.వి.రావు రవిచిత్ర ఫిలింస్ పతాకంపై ప్రముఖ దర్శకుడు యస్.డి.లాల్ గారి దర్శకత్వంలో ఈచిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి కథ: శ్రీమతి జీవనప్రభ మన్మోహన్ దేశాయ్ మాటలు: గొల్లపూడి, పాటలు: సి. నారాయణ రెడ్డి, ఆరుద్ర, సంగీతం: సత్యం, ఫోటోగ్రఫీ: పి.దేవరాజ్, కళ: బి.చలం, నృత్యం: హీరాలాల్, ఎడిటింగ్: కె.బాలు, అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, మంజుల, మురళీమోహన్, రాజబాబు, ప్రభ, అల్లు రామలింగయ్య, పండరీబాయి, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు, గిరిబాబు, కాంతారావు, ముక్కామల, రమణమూర్తి, ఆరుద్ర, షెట్టి, జయమాలిని, తదితరులు నటించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు సత్యం గారి స్వరకల్పనలో వచ్చిన పాటలన్నీ హిట్ అయ్యాయి.
“మంచిని సమాధి చేస్తారా,ఇది మనుషులు చేసేపనియేనా”
“పబ్లిక్ రా, పబ్లిక్ రా,ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా”
“చెకు ముఖి రవ్వ సినబోయింది ఓయమ్మ”
“ఓ హైదరాబాద్ బుల్ బుల్, హే చార్మినార్ చల్ చల్”
వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
పాటల రచయిత ఆరుద్ర గారు ఈ సినిమాలో జడ్జి గా అతిధి పాత్రలో నటించారు. ఈ చిత్రం మొదటివారం 17 లక్షల14వేల 249 రూపాయలు వసూలు చేయగా, రెండవ వారం 9లక్షల76 వేల703 రూపాయలు వసూలు చేసింది.
రెండు వారాలకు కలిపి 26 లక్షల 90వేల 952 రూపాయలు వసూలు రికూర్డ్ కలక్షన్స్ వసూలు చేసింది.
అలాగే 5 వారాలకు 35 లక్షల 28 వేల 955 రూపాయలు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.
ఈ చిత్రం విజయం సాధించి విడుదలైన పలు కేంద్రాలలో 50 రోజులు, ఐదు కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది.
విజయవాడలో 125 రోజులు పైగా ఆడింది.
100 రోజులు ప్రదర్శింపబడిన కేంద్రాలు:-
1) విజయవాడ — ఊర్వశి (57 రోజులు)+ రాజకుమారి (43 రోజులు),
2) తిరుపతి — ప్రతాప్ (85 రోజులు)+ మహావీర్ (15 రోజులు),
3) కర్నూలు — రాధాకృష్ణ (సింగిల్ షిఫ్ట్),
4) రాజమండ్రి — విజయా (డైరెక్ట్,)
5) నెల్లూరు — వినాయక (డైరెక్ట్,)
ధియేటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడింది.
ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలు మద్రాసు హోటల్ తాజ్ కోరమాండల్ లో జరిగాయి.


ఎన్టీఆర్ వాస్తవ జీవిత చరిత్రను తీసే ధైర్యం బాలకృష్ణకు లేదు: లక్ష్మీపార్వతి