మేషరాశి..
ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. పనులలో ఆటంకాలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయమై శ్రద్ద అవసరం. వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.
వృషభరాశి..
చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు. వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు.
మిథునరాశి..
ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మంచిది. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు కష్టంగా ఉంటాయి.
కర్కాటకరాశి..
దూరపు ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
సింహరాశి..
ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరట ఇస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు.
కన్య రాశి..
చేపట్టిన పనులు అవాంతరాలు కలిగి మధ్యలో నిలిచిపోతాయి. వివాదాలకు వెళ్ళాకపోవడం మంచిది. ద్విస్వభావ ఆలోచనలు ఉంటాయి ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
తులరాశి..
సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి.
వృశ్చికరాశి..
సంతాన విద్యా విషయాలలో సంతృప్తి కలుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విభేదించినవారే దగ్గరవుతారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.
ధనుస్సురాశి..
చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది. వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యల నుండి చాకచక్యంగా బయట పడతారు.
మకరరాశి..
శ్రమతో ప్రయాణాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది. దైవ భక్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది. మిత్రుల నుండి సమస్యలు కలుగుతాయి.
కుంభరాశి..
ఆరోగ్యం అంతగా అనుకూలించదు. సన్నిహితులతో దూరంగా మెలగడం మంచిది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేసిన పని మళ్ళీ మళ్ళీ చెయ్యవలసిన రావచ్చు.
మీనరాశి..
ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. చాలా కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది.