telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కౌంటింగ్ ఏజెంట్లకు జనసేన హెచ్చరిక

ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార పార్టీ ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సినీ నటుడు, జనసేన నాయకుడు కె. నాగబాబు హెచ్చరించారు.

ఆదివారం పిఠాపురంలో కౌంటింగ్ ఏజెంట్లతో ఆయన సమావేశమయ్యారు. కౌంటింగ్ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, కౌంటింగ్ ప్రక్రియపై పార్టీ ఏజెంట్లు శ్రద్ధ వహించాలని అన్నారు.

పిఠాపురం నియోజకవర్గంపై జాతీయ స్థాయిలో దృష్టి ఉందని, కూటమి అభ్యర్థులే గెలుస్తారని అన్ని సర్వేలు స్పష్టం చేశాయన్నారు.

భీమవరంలో  జరిగిన కౌంటింగ్‌లో పొరపాట్ల వల్ల జనసేనకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈసారి అలాంటి తప్పులు పునరావృతం కాకూడదని అన్నారు.

కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియ నియమావళిని పాటించాలని, సందేహాలుంటే వెంటనే రిటర్నింగ్ అధికారిని సంప్రదించి ఫిర్యాదు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్‌కుమార్, నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్, యాతం నగేష్, పంచకచర్ల సందీప్, తదితరులు పాల్గొన్నారు.

Related posts