telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి: రేవంత్ రెడ్డి

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికపై పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంఛార్జ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు.

ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంఛార్జ్లు క్రియాశీలకంగా పనిచేయాలని ఆదేశించారు.

ఈనెల 27న పోలింగ్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులను సన్నద్ధం చేయాలన్నారు.

నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని తెలిపారు.

ఇది తీన్మార్ మల్లన్న ఎన్నిక మాత్రమే కాదని  కాంగ్రెస్ ఎన్నిక అని గుర్తించాలన్నారు.

Related posts