హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నగరంలోని కూకట్పల్లి పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ సోదాల్లో అధికారులు 3 గ్రాములు ఎంఎంబీఏ మాదకద్రవ్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రగ్స్ విక్రయిస్తున్న రాజశేఖర్, శైలేష్ రెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
అలాగే తులసీనగర్లో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి ఎస్వోఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు.
రోహిత్, తిలక్ సింగ్ అనే ఇద్దరు నిందితుల వద్ద 45 గ్రాముల గంజాయితో పాటు 3 గ్రాముల ఎంఎండీఏ పట్టుబడింది. దాంతో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.

