జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి మద్దతు తెలిపారు .
తాజాగా ముద్రగడ పద్మనాభంను వ్యతిరేకించి, ఆమె పవన్ కళ్యాణ్ ను గెలిపించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి తను చేస్తానని తెలిపారు ముద్రగడ పద్మనాభం కూతురు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
కాగా.. పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. వైసీపీ తరఫున వంగా గీత బరిలో ఉన్నారు.

