telugu navyamedia
వ్యాపార వార్తలు

సామాన్యుల‌కు గుడ్ న్యూస్‌ : భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచే అమల్లోకి

సామాన్య వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్‌. సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు భారీగా తగ్గించాయి. అయితే, గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి తగ్గింపు లేదు.

19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరపై మాత్రమే తగ్గింపు ఉండనుంది. గురువారం నుంచి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ 19 కిలోల వాణిజ్య సిలిండర్ పై రూ.91.50 ధర తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 

దీంతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1885 కు తగ్గింది. గురువారం నుంచి కోల్‌కతాలో రూ.1995, ముంబయిలో రూ.1,844, చెన్నయ్‌లో రూ.2,045 ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర ఉండనుంది. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,099.5కు చేరింది. తగ్గించిన ధరలు నేటి(గురువారం) నుంచే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి.

అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చివరగా జులై 6న మాత్రమే రూ.50 పెరిగింది. ఆ తర్వాత నుంచి పెరగలేదు.

Related posts