telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైద‌రాబాద్‌లో రెచ్చిపోతున్న ఎంఐఎం కార్పొరేట‌ర్లు..

*హైద‌రాబాద్‌లో రెచ్చిపోతున్న ఎంఐఎం కార్పొరేట‌ర్లు..
*పోలీసులతో ఎంఐఎం కార్పొరేటర్ వాగ్వాదం
*నిన్న భోలక్‌పూర్‌లో మజ్లిస్‌ కార్పొరేటర్‌..

*ఈవేళ ప‌త్త‌ర్ గ‌ట్టి కార్పొరేట‌ర్ సేహేల్ ఖాద్రి
*ఎంక్క్వేరీ కోసం వ‌చ్చిన పోలీసుల‌పై ఎందుకొచ్చావ్ అంటూ ఎస్సైపై సేహేల్ ఖాద్రి రుబాబు

హైదరాబాద్ మహానగరంలో ఎంఐఎం కార్పొరేట‌ర్లు రెచ్చిపోతున్నారు. ఎంక్క్వేరీ కోసం వ‌చ్చిన పోలీసులతో ఎంఐఎం కార్పొరేటర్లు దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. లక్‌పూర్‌లో మజ్లిస్‌ కార్పొరేటర్‌ ఘ‌ట‌న మరిచిపోకముందే.. మరో మజ్లిస్ కార్పొరేటర్‌ ఓల్డ్ సిటీ పోలీసులపై రుబాబు చూపించాడు. ఈసారి పాతబస్తీలోని మక్కా మసీదు దగ్గర ఘటన చోటు చేసుకుంది.

చార్మినార్ వద్ద యునాని ఆస్పత్రి ముందు కొందరు వ్యక్తులు వాహనాలు పార్కింగ్ చేశారు. వాహనాల అక్రమ పార్కింగ్‌పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడికి చేరారు. ‘వాహనాలు తీయించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ సొహైల్‌ ఖాద్రి రంగంలోకి దిగారు. 

అసలు మీకు ఇక్కడ ఏం పని.. ఎందుకొచ్చారంటూ ఎస్‌ఐపై  ఎంఐఎం కార్పొరేటర్ వాగ్వాదానికి దిగారు. ఫోన్ వస్తే వచ్చానని పోలీసులు చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు కార్పొరేటర్.

కొన్నేళ్లుగా ఇక్కడే తమ వాహనాలు పార్కింగ్ చేస్తున్నాం., మీరు ఇప్పుడు కొత్తగా వచ్చారేమో.. మీకు ఈ విషయం తెలియదు..కావాలంటే మీరు మీ పై అధికారిని అడిగి తెలుసుకోండి అంటూ ఎస్‌ఐతో ఎంఐఎం కార్పొరేటర్ రుబాబు ప్రదర్శించడంతో.. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. కాసేపు వాగ్వాదం తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

Related posts