telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం…కరెంటు లేక రోగుల అవస్థలు

*ఏపీలో ప‌లు చోట్ల ప‌వ‌ర్ క‌ట్‌..
*చింత‌ల‌పూడి ప్ర‌భుత్వ ఆస్పత్రిలో విద్యుత్ లేక రోగులు తీవ్ర అవ‌స్థ‌లు..
*ఉక్క‌పోతతో రోగులు విల‌విల‌

ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా చింతలపూడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరెంటు లేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేళాపాళా లేని విద్యుత్ కోతలు వల్ల రోగులు, గర్భిణీ స్త్రీలు, చంటిబిడ్డలు, తల్లులు విలవిలలాడుతున్నారు.

బయటకు రాలేనివారు లోపలే మగ్గిపోతున్నారు. ఆసుపత్రిలో జెనరేటర్ పని చేయడం లేదని.. విద్యుత్ కోతల కారణంగా తెల్లవార్లు విసురుకుంటు కూర్చుంటున్నామని రోగులు, చంటిబిడ్డల తల్లులు వాపోతున్నారు. ఆసుపత్రికి విద్యుత్ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అలాగే అనకాపల్లి లోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్ ఫోన్ లైట్ల లో కేడి పేటకు చెందిన గర్భిణికి ఆపరేషన్ జరిగింద‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. గత రెండు రోజులుగా విత్యుత్ కోతలు జరుగుతున్నాయి.

Related posts