భారత్ వంటి ఆసియా దేశాల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది. కొందరు రాత్రింభవళ్ళు ఎక్కువ సమయాన్ని ఫోన్ పై గడుపుతూ ఉంటారు. స్మార్ట్ ఫోన్ల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదేస్థాయిలో అనార్థాలున్నాయి. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ బ్రైట్ నెస్ కూడా అనారోగ్యానికి కారణమవుతుందని తైవాన్ లో గుర్తించారు. పాతికేళ్ల చెన్ అనే మహిళ కొంతకాలంగా తీవ్రమైన కంటినొప్పితో ఆసుపత్రికి వెళ్లింది. ప్రాథమిక వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు కార్నియా టెస్ట్ చేసి షాక్ తిన్నారు.
ఆమె రెండు కళ్లలో కార్నియా అత్యంత తీవ్రస్థాయిలో దెబ్బతిన్నట్టు వైద్యపరీక్షల్లో తేలింది. రెండు కార్నియాల్లో దాదాపు 500 సూక్ష్మ రంధ్రాలు ఉన్నట్టు తెలుసుకుని వైద్యులు ఆందోళన చెందారు. అంతేకాకుండా, రెటీనా కూడా అదేస్థాయిలో డ్యామేజ్ అయినట్టు తెలుసుకున్నారు. అందుకు కారణం స్మార్ట్ ఫోన్ ను ఫుల్ బ్రైట్ నెస్ తో చూడడమేనని గుర్తించారు. సాధారణంగా ఫోన్ బ్రైట్ నెస్ 300 ల్యూమెన్స్ మాత్రమే ఉండాలి. కానీ చెన్ ఉపయోగించిన ఫోన్ అంతకు రెట్టింపు స్థాయిలో బ్రైట్ నెస్ కలిగి ఉందని తెలిసింది. అయితే అది ఏ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ అనే విషయం వెల్లడించలేదు. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు బ్రైట్ నెస్ తక్కువ రేంజ్ లో ఉంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఆజంఖాన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన జయప్రద