యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన సినిమా “అనుభవించు రాజా” .డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన కశిష్ ఖాన్ హీరోయిన్గా నటిస్తోంది.
తాజాగాకింగ్ నాగార్జున కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసి చిత్రబృందాన్ని విష్ చేశారు. సినిమాలో రెండు కథలు ఉన్నాయి. మొదటిది ఒక గ్రామంలో బంగ్రారాజుగా , రెండవది సిటీలో సెక్యూరిటీ గార్డ్‌గా అలరించనున్నారు.విలేజ్ పార్ట్ కామెడీ రాజ్ తరుణ్‌కి బలం అని చెప్పొచ్చు.
తాజా ట్రైలర్‌లో రూపాయి పాపాయిలాంటిదిరా.. రూపాయ్ పాపాయ్ లాంటిదిరా..దాన్ని పెంచి పెద్దచేసుకోవాలి. కానీ ఎవరి చేతిలో పడితే వాడి చేతిలో పెట్టకూడదు.. అనే డైలాగ్స్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. బంగారం గాడి మనసు సినిమా హాలు లాంటిది. వారానికి ఒక సినిమా వస్తా ఉంటాది.. పోతా ఉంటంది. ఏది శాశ్వతంగా ఆడదు ఇక్కడ..అంటూ రాజ్ తరుణ్ అరియానాతో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఆయినా మన ఊళ్ళో మనకంటే ఫోటుగాడు ఎవడున్నాడు ..మనం గెలవాలంటే ఆడి పుంజు ఈ బరిలో ఉండకూడదు ఆడు ఈ ఊర్లో ఉండకూడదు..వచ్చే సంవత్సరం ఇదే రోజు ఇక్కడే జెండా ఎగరేస్తా బంగారంగా కాదు..ప్రెసిడెంట్ బంగారంగా వేయ్యరా నామినేషన్ అంటూ తరుణ్ డైలాగ్ అదిరింది..
ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కోలీవుడ్ స్టార్ హీరో అమ్మాయిని ర్యాగింగ్ చేశారు… పృథ్వీ షాకింగ్ కామెంట్స్