రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఎన్టీఆర్ కొమురంభీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఆలియా భట్ మరియు ఒలివియా మోరీస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకులముందుకు రానుంది.
కాగా, షూటింగ్ ఇంకా సెట్స్ మీదే ఉండటంతో విడుదల ఆలస్యం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లపై ఓ పాటతో పాటు ఒక సెన్సేషనల్ ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుందట. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్గా ఉండబోతుందని సమాచారం.
అయితే.. చెప్పిన తేదీకే ఈ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకొచ్చేందుకు రాజమౌళి గట్టిగానే ప్రయాణిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఉక్రెయిన్ లో జరుగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఈ నెల 19న ముగియనుందని తెలుస్తోంది. ఈ ఫైట్ సీక్వెన్స్ గురించి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా తెలుగులో భారీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్` రూపొందుతుంది.