టీమిండియా యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తున్నాడో అందరికీ తెలిసిందే. అరంగేట్రం చేసినప్పటి నుంచి అతని బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు బ్యాట్స్‌మెన్ జంకుతున్నారు. అయితే bటీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ మాట్లాడుతూ… బుమ్రా విచిత్రమైన శైలి కావడం.. రన్నప్ తక్కువగా ఉండటం.. యాంగిల్ భిన్నంగా ఉండటంతో ఎలాంటి బంతులు వేస్తాడో అర్థమవ్వదు. ఇక అతడి యార్కర్లు అత్యంత కచ్చితత్వంతో ఉంటాయి. సైడ్ఆర్మ్ బౌలింగ్‌తో లసిత్ మలింగ అద్భుతాలెన్నో చేయడం మనం చూశాం. ఇదే విషయాన్ని వెంకటేశ్ ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ‘బుమ్రా పూర్తిగా భిన్నమైన బౌలర్. ఎందుకంటే అతని బౌలింగ్ శైలి సంప్రదాయానికి భిన్నంగా ఉంటుంది. అతను లసిత్ మలింగ తరహా బౌలర్. బుమ్రా ఒకవైపు నుంచే బౌలింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అలాంటి బౌలర్లను ఆడటం సులువు కాదు. వాళ్ల బంతులు నేరుగా పిచ్ అవుతాయా? స్వింగ్ చేస్తారా? అర్థంకాక బ్యాట్స్‌మన్ తికమక పడతారు. అందుకే వారు సక్సెస్ సాధించారు. బుమ్రా భిన్నమైన శైలే అతడికెంతో ఉపయోగపడుతోంది. అందులో చాలా వైవిధ్యం ఉంటుంది’ అని వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు.
							previous post
						
						
					
							next post
						
						
					

