బీసీసీఐ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ) తో పాటు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా టీమ్ మొత్తాన్ని 18 రోజుల హార్డ్ క్వారంటైన్లో ఉంచనుంది. ఇండియాతో మొదలుకుని యూకే వరకు ఈ క్వారంటైన్ కొనసాగనుంది. మొత్తానికి మూడు నెలల పాటు లండన్‌లో ఉన్న క్రికెటర్లకు తోడుగా ఫామిలీస్‌ను కూడా పంపించేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓవరాల్‌గా వైరస్ దెబ్బకు కాస్త ఆందోళనకు గురైన బీసీసీఐ.. మళ్లీ క్రికెట్‌ను గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. సుమారు మూడున్నర నెలల సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు జూన్ 2న బయలుదేరనుంది. దానికి ముందు ముంబైలో ఆటగాళ్లంతా ఎనిమిది రోజులపాటు ‘కఠిన క్వారంటైన్’లో ఉంటారు. ఇంగ్లండ్ చేరిన తర్వాత పది రోజులు తమను ‘సాఫ్ట్ క్వారంటైన్’కు అనుమతించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి విజ్ఞప్తి చేయనున్న బీసీసీఐ… దీనిపై ఇంకా సంప్రదింపులు జరుపుతోంది. హార్డ్ క్వారంటైన్లో ఆటగాళ్లు పూర్తిగా తమ హోటల్ గదులకే పరిమితం కావాల్సి ఉంటుంది. సహచర ఆటగాళ్లను కూడా కలిసేందుకు వీలుండదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు సౌరవ్ గంగూలీ, జై షా హాజరయ్యే అవకాశం ఉంది
							previous post
						
						
					
							next post
						
						
					


పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేస్తున్నారు: రోజా