బుల్లితెర నటిగా కెరీర్ మొదలుపెట్టిన హరితేజ ఆ తరువాత యాంకర్‌గా, వెండితెర నటిగానూ తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఎంతగానో కష్టపడ్డ హరితేజ…ఆఫర్లు వచ్చిన తరువాత మాత్రం వెనుతిరిగి చూసుకోలేదు. అ..ఆ సినిమాలో మంగమ్మగా ఫన్నీ క్యారెక్టర్లో కనిపించిన హరితేజ, ఆ తరువాత బిగ్ బాస్ రియాల్టీ షోలో తళుక్కుమంది. తృటిలో హరితేజ బిగ్ బాస్ టైటిల్‌ను మిస్ చేసుకున్నప్పటికీ, ఆ షో ద్వారా కావాల్సినంత గుర్తింపును సాధించింది. ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న హరితేజ తాజాగా తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. ఇది ఇలా ఉండగా.. హరితేజ ఇటీవల ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే… డెలివరీ సమయంలో తాను పడిన మానసిక సంఘర్షణను ఇటీవల హరితేజ ఇన్ స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లతో పంచుకుంది. డెలివరీ సమయం వరకూ అంతా హ్యాపీగా జరిగినా, చివరి వారంలో ఇంటిల్లిపాది కరోనా బారిన పడ్డారట. లక్కీగా తన భర్తకు మాత్రం తన డెలివరీ టైమ్ కు నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని హరితేజ చెప్పింది. తనకు కరోనా పాజిటివ్ రావడంతో రెగ్యులర్ గా చెకప్ చేస్తున్న డాక్టర్లు డెలివరీ చేయడానికి నిరాకరించారని, దాంతో కొవిడ్ స్పెషల్ హాస్పటిల్ కు వెళ్ళామని, పుట్టబోయే బిడ్డకు కూడా కరోనా సోకుతుందేమోనని ఎంతో కలత చెందామని హరితేజ తెలిపింది. అయితే దేవుడి దయ వల్ల పుట్టిన పాపకు పరీక్షలలో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పింది. కరోనా తీవ్రత పెరిగిన ఈ సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హరితేజ కోరింది.
మెగా ఫ్యామిలీ అవకాశం ఇస్తుందని ఇండస్ట్రీకి రాలేదు : కమెడియన్ పృథ్వీ