telugu navyamedia
సినిమా వార్తలు

“లూసిఫర్” తెలుగు ట్రైలర్

Lucifer

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు అక్కడ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్ లాల్ కు మలయాళంలోనే కాదు తెలుగులో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన ఎంచుకునే విభిన్నమైన కథలు, సరికొత్త కథలు ప్రేక్షకులను ఎప్పుడూ థ్రిల్ కు గురి చేస్తూనే ఉంటాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ “లూసిఫెర్” చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా హిట్ టాక్ తో, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రం. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి ప్రేక్షాదరణను పొందుతోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ట్రైలర్ లో ఓ రాజకీయ పార్టీ అధినేత మరణిస్తే.. ఆయన స్థానాన్ని దక్కించుకోవడం కోసం కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. రాబందుల్లాంటి వారి చేతుల్లోకి పార్టీ వెళ్లకుండా స్టీఫెన్ (మోహన్ బాబు) అనే వ్యక్తి ఇచ్చే ఎంట్రీ ఇచ్చాడు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts