telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

బ్యాడ్ న్యూస్ : పెరిగిన బంగారం ధరలు

Gold rates hike

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. బంగారాన్ని కొనడానికి మహిళలు చాలా ఇష్టపడతారు. అయితే.. బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. అయితే తాజాగా అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం, వెండి ధరలు బాగా పెరిగిపోయాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ. 210 పెరిగి రూ. 48,050 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 44,050 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పైకి ఎగసి రూ. 45,710 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 41,900 పలుకుతోంది. అయితే బంగారం పైకి లేస్తే వెండి ధరలు మాత్రం కిందకు పడిపోయాయి. కిలో వెండి ధర రూ. 200 తగ్గి రూ.69,300 వద్ద కొనసాగుతోంది.

Related posts