telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కేసులు పెరుగుతుండటంతో 100 నుండి 500 లకు ఫైన్…

mask corona

మన దేశంలో గత వరం రోజుల నుండి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదవుతుండటంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి.  హోలీతో దేశీయంగా పెద్ద పండగలు ప్రారంభం అవుతాయి.  హోలీ రోజున పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడతారు.  అయితే, వేడుకలపై ఆంక్షలు విధించాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సూచనలు చేసింది.  అంతేకాదు, కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు ఆంక్షలు కఠినం చేయాలని కేంద్రం సూచించింది.  మాస్క్ విషయంలో ఛత్తీస్ గడ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.  ఇప్పటి వరకు మాస్క్ లేకుండా పబ్లిక్ ప్లేస్ లోకి వస్తే రూ. 100 ఫైన్ విధించేవారు.  కానీ, ఇప్పుడు దానిని రూ.500 లకు పెంచింది.  ఎపెసిమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది.  అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే సెక్షన్ 144 ని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇదే మార్గంలో మరికొన్ని రాష్ట్రాలు ప్రయాణించనున్నట్లు తెలుస్తుంది.

Related posts