వైసీపీ నాయకులు, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. ఆయన వైసీపీ పార్టీ తరఫున గెలిచి… ఆ పార్టీ నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తారు. ఎప్పుడు ప్రెస్మీట్ పెట్టిన జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతారు. అయితే.. తాజా ఈ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఊహించని షాక్ తగిలింది. చెన్నై ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిచంద్రన్ ఫిర్యాదు మేరకు ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై కేసు నమోదు చేసింది సీబీఐ. ఫోర్జరీ సంతకాలు, పత్రాలతో బ్యాంకులను మోసం చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు… రూ. 237 కోట్లు రుణాలను ఎగగొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంద్ భారత్ పవర్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్న ఎంపి రఘురామ కృష్ణమరాజు, ఇతర డైరెక్టర్లు కనుమూరు రమాదేవి, రాజ్ కుమార్ గంటా, దుంపల మధు సూదన రెడ్డి, నారాయణ ప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్ లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఫోర్జరీ పత్రాలు పెట్టి బ్యాంకు రుణాలు పొందిన రఘురామ కృష్ణంరాజు కంపెనీ… రుణంగా పొందిన రూ. 237 కోట్ల రుణాలను పక్కదారి పట్టించినట్లు సీబీఐకి చెన్నై ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిచంద్రన్ ఫిర్యాదు చేశారు. మార్చి 23న రవిచంద్రన్ చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. అంతేకాదు యూకో బ్యాంకు, ఐఎల్ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వివరాలు రావలసి ఉందని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
							next post
						
						
					

