telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అడవి శేష్‌ హీరోగా హిట్‌-2…

విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన “హిట్‌” మూవీ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీని శైలేష్‌ కొలను డైరెక్ట్‌ చేయగా.. హీరో నాని నిర్మాతగా వ్యవహరించారు. అయితే.. హిట్‌ మూవీ మంచి విజయం సాధించిన తర్వాత దానికి సీక్వెల్‌ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూశారు. అయితే.. తాజాగా దీనిపై అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. అవును హిట్‌-2 వస్తోంది. కానీ ఈ మూవీలో విశ్వక్‌ సేన్‌కు బదులుగా అడవి శేష్‌ నటిస్తున్నాడు. అంతేకాదు దీనికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కూడా ఇవాళ రిలీజ్‌ అయింది. ఈ పోస్టర్‌ అడవి శేష్‌.. ట్విట్టర్‌ వేదికగా రిలీజ్‌ చేశారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభకానుందని సమాచారం. హిట్‌ 1 తెలంగాణ నేపథ్యంలో సాగగా.. హిట్‌-2 ఆంధ్రప్రదేశ్‌ నేపథ్యంలో సాగనుందట. అయితే.. ఈ మూవీలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించనుంది. త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Related posts