కేరళ కుట్టి పూర్ణ 2007లో “శ్రీ మహాలక్ష్మి” సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆపై “అవును” చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. తమిళ, మళయాలంలో మంచి పాత్రలను పోషించి అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అయితే.. ఈ అమ్మడు హీరో రాజ్ తరుణ్ కొత్త మూవీ పవన్ ప్లే మూవీలో కీ రోల్ చేసింది. ఇందులో నెగిటివ్ రోల్ చేస్తుందట ఈ భామ. థ్రిల్లర్ జానర్లో రాబోతున్న ఈ సినిమాలో పూర్ణ… డ్రగ్స్ అడిక్ట్‌గా కనిపించడోతుంది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న పూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించింది. డ్రగ్స్ సేవించడం, షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంది పూర్ణ. అయితే డ్రగ్స్ తీసుకునే వ్యక్తిగా కనిపించడానికి చాలా కష్టపడ్డానని.. డ్రగ్స్‌ను రకరకాలుగా తీసుకుంటారని తెలిపింది. ఇంజెక్షన్ రూపంలో వెయిన్కు తీసుకుంటారు. పౌడర్ తరహాలో ముక్కుతో పీలుస్తారు. అయితే.. డ్రగ్స్ ముక్కుతో పీల్చే సన్నివేశంలో తనకు డగ్ర్ తీసుకోవడం రాకపోవడంతో ముక్కులోకి వెళ్లిపోయేదని తెలిపింది. ఈ క్రమంలో సెట్లో ఉన్న ఓ నటుడు ఎలా పీల్చాలో నేర్పించాడట. ఆ వ్యక్తి సహాయంతో ఆ సన్నివేశాన్ని పూర్తి చేసిందట పూర్ణ. అయితే ఆ నటుడి పేరు మాత్రం చెప్పలేదు.