తమిళ హీరో కార్తీ తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘సుల్తాన్’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. రష్మిక హీరోయిన్. తెలుగులో స్టార్ కథానాయకిగా కొనసాగుతూనే తమిళ పరిశ్రమ మీద కూడ దృష్టి పెట్టింది హీరోయిన్ రష్మిక మందన్న. తమిళంలో ఆమె నటిస్తున్నమొదటి సినిమా ‘సుల్తాన్’. ఈ చిత్రంతో కొలీవుడ్ పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని రష్మిక భావిస్తోంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ టీజర్లో కార్తీ మాస్, క్లాస్ కాంబినేషన్లో అందరినీ అలరించాడు. అయితే.. ఈ టీజర్లోనే మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 2న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
next post