telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమ్మర్‌లో సందడి చేయనున్న రవితేజ “ఖిలాడీ”

టాలీవుడ్ లో రవితేజా ఎప్పటికప్పుడు మాస్ ఎంట్రీలతో, డైలాగ్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంటాడు. అయితే కొత్త సంవత్సరానికి రవితేజ డబుల్ ధమాకా పేల్చాడు. ఒకవైపు క్రాక్ ట్రైలర్‌తో అందరికి సూపర్ ఎంటర్‌టైన్ చేశాడు. దాంతో పాటుగా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఖిలాడీ సినిమా పోస్టర్ విడుల చేసి అభిమానులకు పిచ్చెక్కించాడు. ఈ పోస్టర్‌లో రవితేజా రెండు గెటప్స్‌లో ఉన్నాడు. వాటిలో ఒకదానిలో అమాయకంగా ఉన్న రవితేజా మరొకదానిలో కన్నింగ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరని హీరోయిన్లుగా చేస్తున్నారు. డాక్టర్ జయంతీలాల్ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్‌లపై సత్యనారాయణ దీనిని నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను చిత్ర బృందం అఫిషీయల్‌గా ప్రకటించేసింది. ఈ ఏడాది మే 28న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఈ అప్టేట్‌తో రవితేజ ఫ్యాన్స్‌ పండగా చేసుకుంటున్నారు.

Related posts