భారత్-ఆసీస్ మధ్య ఇప్పటివరకు జరిగిన మూడు టెస్ట్ లలో ఒక్కో జట్టు ఒక్కో మ్యాచ్ లో విజయం సాధించగా ఒక మ్యాచ్ ఏమో డ్రా గా ముగిసింది. దాంతో చివరి నాలుగో టెస్ట్ లో ఎవరు విజయం సాధిస్తే సిరీస్ వారిది అవుతుంది. ఈ నెల 15 నుండి భారత్-ఆసీస్ మధ్య చివరి నాలుగో టెస్ట్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఇదిలా ఉంటె ఈ సిరీస్ లో భారత ఆటగాళ్లను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. టెస్ట్ సిరీస్ ప్రారంభం కాకముందునుండి ఇప్పటివరకు ఒక్కో మ్యాచ్ కు ఒక్కో ఆటగాడు దూరమవుతున్నాడు. ఇక మూడో టెస్ట్ లో అయితే మొత్తం 5 మంది ఆటగాళ్లు గాయపడగా అందులో జడేజా, విహారి, బుమ్రా జట్టుకు దూరం అయ్యారు. అయితే టీం ఇండియా గాయాల పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ… తన ట్విట్టర్ లో జట్టుకు బుమ్రా, షమీ, ఉమేష్, రాహుల్, జడేజా, విహారి జట్టుకు దూరమయ్యారు. అయితే నాలుగో టెస్ట్ కు జట్టులో 11 మంది లేకపోతే చెప్పండి నేను ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. క్వారంటైన్ నిబంధనలు తర్వాత చూసుకుందాము అని ఫన్నీగా ట్విట్ చేసాడు. చూడాలి మరి నాలుగో టెస్ట్ లో ఎవరెవరు ఆడుతారు అనేది.
							previous post
						
						
					
							next post
						
						
					

