telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ కు విజయశాంతి కౌంటర్…

విజయశాంతి బీజేపీలో చేరిన తర్వాత చాలా యాక్టివ్ గా మారారు. అయితే ఆవిడ తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు కౌటర్ వేశారు. ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని చెప్పినందుకు సంతోషం. వీరి పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యమే ఆందోళనకరంగా తయారైంది. ఈ అధికార పార్టీ దోపిడీలతో సామాన్య ప్రజల జీవన పరిస్థితులే ప్రమాదంలోకి పడిపోతున్నాయి. అయితే, సీఎం పదవికి దళిత బిడ్డలను మోసగించి, వారసునికెట్లా కట్టబెడతావని ప్రజలు, బీజేపీ నిలదీస్తున్న భయానికి 10 ఏళ్లు నేనే సీఎం అంటూ…. ఏవో మాయమాటలు చెప్పి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే, మబ్బుల మాటున ఉండే వానా కాలపు సూర్యుడిలా…. మరో పదేళ్ళ పాటు ఎప్పుడు ప్రగతి భవన్‌లో కనిపిస్తాడో… ఎప్పుడు ఫాం హౌస్‌లో దర్శనమిస్తాడో అర్థంకాని అయోమయంతో జనం తననే భరించాలని హెచ్చరిస్తున్నట్టుంది. పదేళ్ళ వరకూ ఎందుకు… కేసీఆర్ ‘కారు’మబ్బుల్ని తెలంగాణ ప్రజల మరో మూడేళ్ళలోనే చెదరగొడతారని ఆయన అర్థం చేసుకునే రోజులు దగ్గర పడుతున్నాయి అని హెచ్చరించారు. చూడాలి మరి అప్పటివరకు ఏం జరుగుతుంది అనేది.

Related posts