జగపతి బాబు ప్రధాన పాత్రగా తెరకెక్కతున్న సినిమా ఎప్సీయూకే(ఫాదర్ చిట్టీ ఉమా కార్తిక్). ఈ చిత్రానికి భారీ రేంజ్లో ప్రచారణ చేస్తున్నారు. అందులో భాగంగా చిత్ర యూనిట్ రోజుకో పాత్ర పోస్టర్‌ను రిలీజ్ చేస్తుంది. ఎఫ్‌సీయూకే (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్)నుంచి మొదట ఫాదర్‌గా జగపతి బాబు రివీల్ అయ్యాడు. నేడు ఉమా పాత్రను రివీల్ చేశారు. ఈ పాత్రలో అందాల ముద్దుగుమ్మ అమ్ము అభిరామ్ చేస్తున్నారు. ఈ పాత్ర రివీల్గా విడుదల చేసిన పోస్టర్లో అమ్ము అభిరామ్ చేతిలో తెల్లకోటు, స్టెతస్కోపుతో కనిపించారు. దీనిని బట్టి సినిమాలో డాక్టర్‌గా అమ్ము కనపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మడు తమిళ స్టార్ హీరో దనుష్ సరసన అసురన్ సినిమాతో పరిశ్రమలో అడుగు పెట్టింది. తెలుగులో మాత్రం ఎఫ్సీయూకేతో పరిచయం కానుంది. ఈ సినిమా తరువాత నెట్‌ఫ్లిక్స్‌లో ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనుంది. ఎఫ్‌సీయూకే కొత్త పోస్టర్‌ను చూసి ఇందులో అమ్ము పాత్ర ఎలా ఉంటుందని అభిమానులు అంచనా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇందులో ఉమా పాత్ర చాలా రొమాంటిక్‌గా ఉందని మాత్రం తెలిపారు. అయితే ఈ సినిమా నుంచి ఇంకా ఓ పాత్ర విడుదల కావాల్సి ఉంది. అదే కార్తీక్ హీరో. ఈ పోస్టర్ కూడా త్వరలో రిలీజ్ అవ్వనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలబడనుంది. మరి సంక్రాంతికి ఏరేంజ్‌లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.
previous post
next post