మన దేశ ఫుట్ బాల్ జట్టు అయిన ఇండియన్ యారోస్ కోల్‌కతాకు చేరుకుంది. రానున్న ఊఎఫ్ఏ షీల్డ్ లీగ్ కోసం కోల్‌కతాకు చేరుకుంది. అయితే రాబోయే ఐఎఫ్ఏ షీల్డ్ ఐ-లీగ్‌నే లక్ష్యంగా ఇండియన్ యారోస్ ప్రస్తుతం శిక్షణ తీసుకుంటుంది. ఈ జట్టు కోచ్ మాట్లాడుతూ జరగనున్న షో పీస్ ఈవెంట్ మనకు ఎంతగానో ఉపయోగపడుందని, మన శిక్షణకు పనికొస్తుందని అన్నారు. అయితే ఐఎఫ్ఏ షీల్డ్ కాంపెన్ కోసం కలకత్తాచేరుకుంది. అయితే ఈ జట్టు కోచ్ వెంకటేష్ మాట్లాడుతూ ముందు రానున్న ఛాలెంజ్‌లు మన మెరుగుదలకు ఉపయోగపడతాయన్నారు. అంతేకాకుండా వీటితో జాతీయ స్థాయికి చేరుకునేందుకు దోహదం చేస్తాయన్నారు. జట్టుకు ప్రధాన లక్ష్యంగా ఈ ఐలీగ్ నిలువనుందని తెలిపారు. జట్టు సభ్యలకు ఈ లీగ్ మంచి అవకాశాలను కల్సిస్తుందన్నారు. ప్రస్తుతం ఇండియన్ యారోస్ జట్టు జూనియర్ లీగ్ నుంచి మెరుగు పడుతూ ఇక్కడివరకు వచ్చిందని, వారి మరింత కష్టపడితే జాతీయ స్థాయికి చేరుకుంటారని వెంవటేష్ అన్నారు. అయితే వారు జూనియర్ నేషనల్ టీమ్‌గా ఉన్నప్పుడు కోచ్ షువెందు పాండా వద్ద ఒడిసాలో శిక్సణ తీసుకున్నారు. ఇంతకుమందు జట్టులానే వీరు కూడా ఇక్కడ నుంచి అంతర్జాతీయ స్థాయిలోకి అడుగుపెట్టేందుకు శిక్షణ పోందుతారని అన్నాడు. అంటే అండర్ 19 లెవెల్‌కు ప్రిపేర్ అవుతున్నారు. అయితే కలకత్తాకు కాస్త ముందుగా చేరుకోవడం ద్వారా ఆటగాళ్లకు వాతావరణానికి అలవాటు పడేందుకు కావలసిన సమయం దొరుకుతుందని, దాంతో వారు బాగా ప్రదర్శించగలుగుతారని అన్నాడు. మరి ఈ ఐలీగ్‌లో ఇండియన్ యారోస్ ఎంతలా రాణిస్తుందో వేచి చూడాల్సిందే.
previous post
next post
వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో చంద్రబాబు దిట్ట: దగ్గుబాటి