తాజాగా జరిగిన హైదరాబాద్ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇవ్వడంపై ప్రకాష్ రాజ్ మండిపడ్డ విషయం తెలిసిందే.. పవన్ కళ్యాణ్ ఓ ఊసరవెల్లి అంటూ ప్రకాష్ రాజ్ విమర్శించారు. ప్రకాష్ రాజ్ ఇలా పవన్ పై విమర్శలు చేయడంపై అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో పవన్ కు ప్రకాశ్ రాజ్ కు మధ్య దూరం పెరిగిందనే అంటున్నారు.ఇదిలా ఉంటే.. ‘వకీల్ సాబ్’ మూవీలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు పవన్, ప్రకాష్ రాజ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే త్వరలో పవన్ కల్యాణ్ – ప్రకాశ్ రాజ్ ఒకే చోట కలవనుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోన్న లేటేస్ట్ అప్డేట్ ఏంటంటే.. వీరిద్దరిపై నాలుగు రోజులు పాటు కొన్ని సీన్స్ చిత్రీకరించాల్సి వుందట. త్వరలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని.. ఇప్పుడు వీరిద్దరు షూటింగ్ స్పాట్ లో ఒకరికి ఒకరు ఎదురైనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో..? అనేది ఆసక్తిగా మారిందంటున్నాయి సినీ వర్గాలు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది.
							previous post
						
						
					
							next post
						
						
					

