“మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న 26వ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంకర, దిల్‌రాజు, మహేష్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి అయ్యింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సంగీత కూడా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాలో నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ ఒక ఫన్నీ క్యారెక్టర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు బండ్ల గణేష్ రెమ్యునేషన్ ఎంత తీసుకోబోతున్నాడనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సమాధానంగా బండ్ల గణేష్ రోజుకు ఐదు లక్షలు చొప్పున పారితోషికం తీసుకుంటున్నాడనే వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ప్రస్తుతం అసలేమాత్రం ఫామ్ లో లేని ఈ కమెడియన్ కు 5 లక్షల పారితోషికం ఏంటనేది నెటిజన్ల ప్రశ్న. అయితే ఈ వార్తలన్నీ బండ్ల గణేష్ కు హైప్ తేవడానికే అనేది కొందరి వాదన. ఏదైతేనేం ఈ వార్తలతో బండ్ల గణేష్ కు కావాల్సినంత పబ్లిసిటీ దొరికేస్తోంది ఫ్రీగా.
previous post