బాలీవుడ్ మరో విషాదం నెలకొంది. 2020లో సంవత్సరం చిత్ర పరిశ్రమకు కలిసివచ్చినట్లుగా లేదు. ఎందుకంటే కరోనాతో ఇప్పటికే షూటింగ్‌లు, థియేటర్లు మూతపడగా.. మరోవైపు ప్రముఖ నటులు మృతి చెందారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ రాజ్‌పుత్ ఘటన నుంచి తెరుకోకముందే… మరో నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్ సీనియర్ నటుడు ఆసిఫ్ బాస్రా (53)ఆత్మహత్య కలకలం రేపింది. అయితే ఆసిఫ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే దానిపై ఇంకా స్పష్టం రాలేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల సమీపంలో ఆసిఫ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఆయన ఉరివేసుకుని చనిపోయినట్లు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన పెంపుడు కుక్క గొలుసుతోనే ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ప్రాథమిక సమాచారం. కాగా.. టీవీ నటుడుగా ఫేమస్ అయిన ఆసిఫ్ బాస్రా “పర్జానియా”, “బ్లాక్ ఫ్రైడే” లాంటి అనేక బాలీవుడ్ సినిమాల్లో ఆకట్టుకున్నాడు.
previous post
next post
వర్మ “పవర్ స్టార్” తీస్తే తప్పేంటి ?… ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్