ప్రముఖ మోడల్, నటుడు మిలింద్ సోమన్ తన 55వ పుట్టిన రోజు వేడుకను తన లైఫ్ పార్టనర్‌తో కలిసి గోవా బీచ్‌లో చాలా ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. బర్త్ డే సందర్భంగా ఈ వయసులో కూడా తాను ఎంత ఫిట్‌గా ఉన్నాడో తెలిపేలా ఉండే ఒక పిక్‌ను మిలింగ్ తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఉదయం పూట బీచ్‌లో రన్ చేస్తూ ఉన్న ఫోటోను షేర్ చేశాడు. అయితే ఉదయం పూట బీచ్‌లో రన్ చేయడం మాములు విషయమే. కానీ ఆ పిక్ లో ఆయన ఒంటి మీద నూలిపోగు లేకపోవడమే ఈ పిక్ స్పెషల్. 55వ యేట అడుగుపెట్టినప్పటికి తాను చాలా ఫిట్‌గా ఉన్నాను అని ప్రపంచానికి తెలియజేయడానికే మిలింగ్ తన పూర్తి శరీరాన్ని చూపిస్తూ ఫోటోకు ఫోజిలిచ్చారు. అయితే ఈ ఫోటోలను ఆయన భార్యే స్వయంగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మిలింద్ భార్య అంకిత కోన్వర్ ఈ పిక్ ను షేర్ చేస్తూ తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఆయన ఫిట్ నెస్ ను కొందరు ప్రశంసిస్తూ ఉంటే, మరికొందరు మాత్రం మీమ్స్ చేస్తున్నారు.
Happy birthday to me 😀
.
.
.
55 and running ! 📷 @5Earthy pic.twitter.com/TGoLFQxmui— Milind Usha Soman (@milindrunning) November 4, 2020