రిపబ్లిక్ టెలివిజన్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి ఊహించని షాక్ తగిలింది. అర్నాబ్ గోస్వామి ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటీరియల్ డిజైనర్ మరణానికి సంబంధించిన విషయంలో ఆయనను మహారాష్ట్ర పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. 2018లో 53 ఏళ్ల డిజైనర్ అన్వే నాయక్, అతని తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఓ సుసైడ్ నోట్ పెట్టి చనిపోయారు. ఆ సుసైడ్ నోట్లో అర్నాబ్ గోస్వామి, మరో ఇద్దరి పేర్లు ఉన్నాయి. అతనికి చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వనందున ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యయ చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే..అర్నాబ్ గోస్వామి అరెస్ట్‌పై కేంద్ర మంత్రి జవదేకర్ స్పందించారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగిందని, మళ్లీ ఎమర్జన్సీ రోజులు వచ్చాయని జవదేకర్ ఫైర్ అయ్యారు. సోనియా, రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే మహారాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. కాగా.. ఇప్పటికే టెలివిజన్ టీఆర్పీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్నాబ్ గోస్వామికి మరో ఎదురుదెబ్బ తగలడం చర్చనీయాంశంగా మారింది.
							previous post
						
						
					
							next post
						
						
					
