నవంబర్ 2న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమనుల నుంచి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం షారుక్ యూఏఈలో ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తన జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మద్దతు ఇస్తున్నారు. ఈ రోజుతో ఆయన 56వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఇక షారుక్ తన 30 ఏళ్ల కెరీర్లో దాదాపు 90 చిత్రాల్లో నటించారు. చిత్ర పరిశ్రమలోని అందరి హీరోయిన్లతో కలిసి పనిచేశారు. ఈ క్రమంలో అనుష్క శర్మ, మాధురి దీక్షిత్, జుహీ చావ్లా, ఫరా ఖాన్ లతో పాటు పలువురు ఆయనకు బర్త్‌డే విషెస్ తెలిపారు. మాధురి దీక్షిత్… షారుఖ్ తో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేస్తూ.. ‘మనం కలిసినప్పుడల్లా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏదో మ్యాజిక్ జరుగుతుంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. జాగ్రత్తగా ఉండండి. త్వరలో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. ఇదిలా ఉండగా కింగ్ ఖాన్ పాత స్నేహితుల్లో ఒకరైన జూహి చావ్లా ఎస్ఆర్కే పుట్టిన రోజు సందర్భంగా 500 మొక్కలను నాటినట్లు ట్విటర్లో వెల్లడించారు. అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షారుక్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. “లెజండరీ, ఒపెన్ హార్టెడ్నెస్, ఇంటెలిజెన్స్.. అల్ ఇన్ వన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ పోస్టు చేశారు. అలాగే షారుక్‌తో కలిసి అనేక పాటలకు కొరియోగ్రఫ్ చేసిన ఫరా ఖాన్.. గతంలో షారుక్‌తో దిగిన ఫోటోను షేర్చేస్తూ ఆయనకు బర్త్‌డే విషెస్ తెలిపారు. అదే విధంగా షారుక్ నటించిన ‘బాజీగర్’ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టి శిల్పా శెట్టి తన మొదటి హీరోకు ట్వీట్ చేశారు. ‘నా మొదట హీరో, నా బాజిగర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. జీవితంలో అన్ని ఆనందాలను పొందాలని ఆశిస్తున్నాను’. అని పేర్కొన్నారు. ఈసారి తన పుట్టిన రోజున మన్నత్‌ను తన అభిమానులకు వర్చువల్ రియాల్టీ ద్వారా చూపించేందుకు సిద్దం అవుతున్నట్లు ప్రకటించాడు షారుఖ్. వీఆర్ సెట్‌ను ఉపయోగించి మన్నత్ ను అనువనువు 360 డిగ్రీలు తిరిగి చూసే వీలును షారుఖ్ కల్పించబోతున్నాడు.
Whenever we meet, there’s masti, magic & loads of love ♥️ Here’s wishing you a very happy birthday @iamsrk. Stay safe & hope to see you soon. pic.twitter.com/mpWMnJq1Ol
— Madhuri Dixit Nene (@MadhuriDixit) November 2, 2020
I plant 500 trees for #ShahRukh on his birthday for #CauveryCalling
From co-star, co-producer to co-owner ….dotted with much laughter and some tears, it’s been a long, colourful & eventful journey 🙏😇🌟🌸😅🤪 Happy Birthday @iamsrk@ishafoundation— Juhi Chawla (@iam_juhi) November 2, 2020
ఉదయభాను కోసం బాబా మాస్టర్ స్టూడియోల చుట్టూ…!?